డెంగ్యూ, మలేరియా నివారణకు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి

Sakshitha news

డెంగ్యూ, మలేరియా నివారణకు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి …….అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్య నాయక్

వనపర్తి
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 19, 20, 8వ వార్డుల్లో నిర్వహించిన డ్రై డే కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్ పాల్గొని పరిశీలించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వార్డుల్లో నిర్వహిస్తున్న డ్రై డే కార్యక్రమాలను పరిశీలించారు. ఆరోగ్య సిబ్బంది చేపడుతున్న డెంగ్యూ, మలేరియా నివారణ అవగాహన కార్యక్రమాలను పరిశీలించి, ప్రజలకు అందిస్తున్న సూచనలపై ఆరా తీశారు. అదేవిధంగా దోమల వృద్ధికి కారణమయ్యే ప్రదేశాలను గుర్తించి చేపడుతున్న యాంటీ లార్వా ఆపరేషన్లను పరిశీలించారు.

అనంతరం అదనపు కలెక్టర్ అధికారులు, మున్సిపల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, దోమల వృద్ధికి అవకాశం లేకుండా యాంటీ లార్వా చర్యలను నిరంతరం కొనసాగించాలని ఆదేశించారు.

ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని పాటిస్తూ డెంగ్యూ, మలేరియా నివారణలో ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.

కార్యక్రమంలో డీఎంహెచ్వో భాస్కర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ నిరంజన్, మున్సిపల్ అధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.