గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్ అందుకున్న నిధిష్ ఠాకూర్…..
అతిపెద్ద తైక్వాండో పాఠంలో భాగస్వామిగా నిలిచి అరుదైన ఘనత….
సాక్షిత న్యూస్ పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ ఆగస్టు 30: రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ తనయుడు నిధిష్ ఠాకూర్ ప్రతిష్టాత్మక గిన్నిస్ వరల్డ్ రికార్డులో భాగస్వామిగా నిలిచి అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా ఆయనకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్ అందింది.
2026 ఆగస్టు 9న హైదరాబాద్, తెలంగాణలో నిర్వహించిన అతిపెద్ద తైక్వాండో పాఠంలో మొత్తం 533 మంది పాల్గొన్నారు. జయంత్ రెడ్డి ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ, సుమన్ ఆర్ట్ థియేటర్స్ (భారత్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
ఈ చారిత్రాత్మక రికార్డు కార్యక్రమంలో భాగస్వామిగా పాల్గొన్న నిధిష్ ఠాకూర్‌కు తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్ లభించడం పట్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రికార్డు కార్యక్రమంలో భాగస్వామిగా నిలవడం నిధిష్ ఠాకూర్ ప్రతిభకు, క్రీడల పట్ల ఆయనకున్న ఆసక్తికి నిదర్శనమని పలువురు అభినందించారు.
“ఆఫిషియల్లీ అమేజింగ్” అనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపుతో నిధిష్ ఠాకూర్ ఘనత సాధించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
