కట్టంగూర్ మండలంలో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ:ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం

Sakshitha news

కట్టంగూర్ మండలంలో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ:ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం

నకిరేకల్ నియోజకవర్గం, కట్టంగూర్ మండల తహశీల్దార్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఎంపీ చామల మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలిపారు. అధునాతన స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా నిత్యావసర సరుకులను పారదర్శకంగా, సులభంగా పొందే వీలు కలుగుతుందని చెప్పారు. లబ్ధిదారులకు స్వయంగా స్మార్ట్ రేషన్ కార్డులను అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల రెవెన్యూ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.