స్మార్ట్ రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే KR నాగరాజు

Sakshitha news

స్మార్ట్ రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే KR నాగరాజు …

రాష్ట్రంలో ప్రతి అర్హుడికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. ఎర్రగట్టుగుట్ట MSR గార్డెన్ లో 65,66,1,2,55 డివిజన్లుకు చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను ఎంపీ కడియం కావ్య గారితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…గతంలో ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అన్నారు. రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు.

ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. గుడిసెలు లేని గ్రామాలను చూడాలనేది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష్యమని తెలిపారు. ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే వ్యక్తులను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. ప్రతి అర్హుడికి దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు అందించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే నాగరాజు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో 65 డివిజన్ అధ్యక్షులు నేదునూరి సునీల్,66వ డివిజన్ అధ్యక్షులు గొర్రె కిరణ్,1వ డివిజన్ అధ్యక్షులు చిర్ర రాము,2వ డివిజన్ అధ్యక్షులు పుట్ట తిరుపతి,55వ డివిజన్ అధ్యక్షులు గడ్డం అరుణ్,66వ డివిజన్ అధ్యక్షులు గొర్రె కిరణ్, హనుమకొండ జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు పింగిలి వెంకటరెడ్డి,ఆత్మకూరు మార్కెట్ వైస్ చైర్మన్ తిరుపతి, డీసీసీ జనరల్ సెక్రెటరీ మాజీ కార్పొరేటర్ బానోతు కల్పన, వంగపహాడ్ PACS చైర్మన్ రాజేష్ గౌడ్, మండల అధ్యక్షులు అశోక్ కుమార్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రాకేష్ రెడ్డి, మహిళ అధ్యక్షురాలు పూలక్క,ఉపాధ్యక్షురాలు స్వాతి,2వ డివిజన్ మాజీ అధ్యక్షులు పొన్నాల రఘు, సీనియర్ నాయకులు,గ్రామ శాఖ అధ్యక్షులు,సర్పంచులు,అధికారులు,తదితరులు పాల్గొన్నారు.