సామాజిక కార్యక్రమాలకు వేదికలు కమ్యూనిటీ హళ్లు : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్
129 – సూరారం డివిజన్ లక్ష్మీ నగర్ లో నూతనంగా నిర్మించనున్న లక్ష్మీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన భవన నిర్మాణ పనులకు బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ఐక్యతకు, సామాజిక కార్యక్రమాల నిర్వాహణకు చక్కటి వేదికలు కమ్యూనిటీ హళ్లు అని అన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను కమిటీ సభ్యులు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, సురేష్ రెడ్డి, లక్ష్మీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు అమృత రెడ్డి, ప్రధాన కార్యదర్శి శంకర్ రావు, నాయకులు ఇంద్రసేన గుప్తా, యాదిరెడ్డి, రాఘవ రెడ్డి, సురేష్, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు కొండకల్ల శ్రీనివాస్ రెడ్డి, వారాల వినోద్, కోల శ్రీకాంత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
