మైనారిటీ మహిళలకు ఆర్థిక చేయూత – చెక్కుల పంపిణీ కార్యక్రమం

Sakshitha news

మైనారిటీ మహిళలకు ఆర్థిక చేయూత – చెక్కుల పంపిణీ కార్యక్రమం

మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మైనారిటీ మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు , పట్నం మహేందర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ మంచోదరి , ఎమ్మెల్యే గాంధీ , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ , టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి , మేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నె రాజు , మైనారిటీ కార్పొరేషన్ ముజీబ్ , గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ యాదవ్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మైనారిటీ మహిళలకు చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.

మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత

మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది.

మహిళలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి కుటుంబాలకు భరోసా కల్పించడమే లక్ష్యం.

మహిళలు స్వయంగా ఉపాధి అవకాశాలను సృష్టించుకుని ఆర్థికంగా బలపడేలా ప్రోత్సహించడం జరుగుతోంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనా విధానంలో మహిళల సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.

మహిళ ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం మరింత బలపడుతుందనే లక్ష్యంతో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది.

“మహిళల అభివృద్ధి – కుటుంబాల అభివృద్ధి – సమాజ అభివృద్ధి”