ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వార మంజూరైన 53,24,150/- యాభై మూడు లక్షల ఇరవై నాలుగు వేల నూట యాభై రూపాయల ఆర్థిక సహాయాన్ని 84 మంది బాధిత కుటుంబాలకు అందచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి CMRF ద్వారా మంజూరైన 53,24,150/- యాభై మూడు లక్షల ఇరవై నాలుగు వేల నూట యాభై రూపాయల ఆర్థిక సహాయానికి సంబందించిన CMRF చెక్కుల ను 84 మంది బాధిత కుటుంబాలకు తాజా మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ , ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి అందచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరం అని, ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని PAC చైర్మన్ గాంధీ పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. PAC చైర్మన్ గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు.
అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థికంగా అండగా నిలుస్తుందని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
ఈ సందర్భంగా వైద్య చికిత్స కి సహకారం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము అని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, నాయి నేనీ చంద్రకాంత్ రావు, ఉరిటి వెంకట్ రావు,DSRK ప్రసాద్, MD ఇబ్రహీం, జిల్లా గణేష్ , మారెళ్ళ శ్రీనివాస్,చంద్రమోహన్ సాగర్, అష్రఫ్, భాషా మరియు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST