మహిళల సంక్షేమమే లక్ష్యం….
54వ.డివిజన్లో ఘనంగా ఇందిరమ్మ చీరల పంపిణీ
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి….
–కార్పొరేటర్ ఎండీ ముస్తాఫా…
సాక్షిత పెద్దపల్లి జిల్లా ప్రతినిధి గోదావరిఖని/
మహిళల సంక్షేమం, పేద కుటుంబాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు కృషి చేస్తున్నామని 54వ.డివిజన్ కార్పొరేటర్ ఎండీ ముస్తాఫా అన్నారు. శనివారం తిలక్‌నగర్‌లోని తన నివాసం వద్ద డివిజన్ పరిధిలోని అర్హులైన మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ ఎండీ ముస్తాఫా మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, పేద కుటుంబాల సంక్షేమం కోసం చేపడుతున్న పలు కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని పేర్కొన్నారు.
డివిజన్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో ముందుంటానని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
ఇందిరమ్మ చీరలు అందుకున్న మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్పీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST