కమ్యూనిస్టుల కృషి ఫలితంగానే ఉపాధి హామీ పథకం
ఉపాధికూలీల పొట్టలు కొట్టేందుకే కేంద్రం వాటా తగ్గింపు: ………..సిపిఐ
సాక్షిత వనపర్తి :
దేశంలో ఉపాధి కూలీల పొట్టలు కొట్టేందుకే కేంద్రం ఉపాధి హామీకిచ్చే 90 శాతం నిధులను 60 శాతానికి తగ్గించిందని సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్ విమర్శించారు. వనపర్తి అంబేద్కర్ చౌక్ లో ఉపాధి హామీ పథకంపై కేంద్ర బిజెపి వైఖరికి నిరసనగా ధర్నా చేశారు. మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకానికి కేంద్రం 90% నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలు 40 శాతం నిధులు సమకూర్చాలన్న నిబంధన దురుద్యశపూరితమన్నారు. నిధుల కొరతతో రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయని ఉపాధి హామీ పథకానికి 40% నిధులు ఎలా ఇస్తాయని ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వంలో కమ్యూనిస్టుల కృషి ఫలితంగా ఉపాధి హామీ పథకం వచ్చిందని ఏళ్లుగా కూలీల కడుపులు నింపుతోందన్నారు. బిజెపి వచ్చాక ఉపాధి హామీ పథకానికి ఇచ్చే నిధులను క్రమంగా తగ్గిస్తూ వస్తుందన్నారు. 40% నిధులు రాష్ట్రాలు సమకూర్చలేకపోతే పథకం మూలన పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం కూడా ఇదే అన్నారు. వాటాను 60 శాతానికి తగ్గించి వంద నుంచి 125 పని దినాలకు పెంచుతామని చెప్పటం కుట్రపూరితమన్నారు.
2020- 21 సంవత్సరంలో ఉపాధి హామీకి 1,11,000 కోట్లు కేటాయించగా 2025- 26 లో 80 వేల కోట్లకు తగ్గించారని దీని వెనక ఆంతర్యం ఏమిటని నిలదీశారు. 90% వాటాను యథాతథంగా కొనసాగించాలని బడ్జెట్లు 2 లక్షల కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి దేశ స్వాతంత్ర సమరానికి సారథ్యం వహించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు పెడితే మహాత్మా గాంధీ పేరు తొలగించి వికసిత్ జిరామ్ జి గా పేరు పెట్టడం దురుద్దేశ పూరితమన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఏనాడూ పాల్గొనని బిజెపి మహాత్మా గాంధీ పేరును తిరుమల చేసేందుకు ఈ కుట్ర పన్నిందన్నారు. మహాత్మా గాంధీ పేరును పథకానికి కొనసాగించాలన్నారు. నిధుల తగ్గింపు వల్ల ఉపాధి కోల్పోనున్న పేదలు తిరగబడి రోడ్డెక్కి పోరాడాలని కమ్యూనిస్టు పార్టీ అండగా ఉంటుందన్నారు. ఉపాధి హామీ పథకంపై తమ విధానం మార్చుకోకుంటే బిజెపికి ప్రజాక్షేత్రంలో చావు దెబ్బ తప్పదని హెచ్చరించారు. మాజీ సర్పంచ్ కళావతమ్మ, కేతేపల్లి ఉపసర్పంచ్ కృష్ణవేణి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడుకే శ్రీరామ్, పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, ఎన్ఎఫ్ఐ డబ్ల్యు పట్టణ కన్వీనర్ జయమ్మ కోకన్వీనర్లు శిరీష నేతలు నరేష్, రమణ ,బాలేమియా, రాంబాబు, జ్యోతి, సుప్రియ, రూప భారతి అలివేల తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
