“ప్రశ్నిస్తున్న రామగుండం”.. కాంగ్రెస్ పాలనపై బీజేపీ సమరశంఖం….
మూడేళ్ల పాలనలో హామీల అమలేది….?
ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం…
— సోమరపు లావణ్య–అరుణ్‌కుమార్…
సాక్షిత న్యూస్ పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం/ఆగస్టు 30: కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తిచేసుకున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని బీజేపీ రాష్ట్ర నాయకులు సోమరపు లావణ్య–అరుణ్‌కుమార్ విమర్శించారు.
రామగుండం నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, హామీల అమలుపై ప్రశ్నించేందుకు “ప్రశ్నిస్తున్న రామగుండం” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను సోమరపు లావణ్య–అరుణ్‌కుమార్ విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పేరుతో ప్రజా కంటక పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు.
మూడేళ్లు గడిచినా ఇచ్చిన హామీల్లో అనేకం ఇంకా అమలుకు నోచుకోలేదని విమర్శించారు.
రామగుండం నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యలు, అభివృద్ధి పనుల పరిస్థితి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు తదితర అంశాలను “ప్రశ్నిస్తున్న రామగుండం” కార్యక్రమం ద్వారా ప్రజల తరఫున నిలదీస్తామని తెలిపారు. ప్రతి వర్గం ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం అవసరమైన ప్రజా ఉద్యమాలను చేపడతామని స్పష్టం చేశారు.
“ప్రశ్నించే హక్కు ప్రజలది.. ప్రజల తరఫున ప్రశ్నించడం మా బాధ్యత” అని వారు పేర్కొన్నారు. కార్యక్రమానికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సుల్వలక్ష్మి నర్సయ్య, మహావాది రామన్న, మామిడి రాజేశ్, మాతంగి రేణుక, దాసరి శ్రీనివాస్, పెద్దపల్లి పవన్, శ్రీరాముల సత్యం, బాణాల రంజిత్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు మచ్చా విశ్వాస్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చిలుక భారతి, మండల అధ్యక్షులు ఐతే పవన్, మిట్టపల్లి సతీష్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
