ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి.

Sakshitha news

ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి…..
విద్యార్థులకు యూనిఫాంలు, షూలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ..

సాక్షిత : సూర్యాపేట జిల్లా/ కోదాడపాఠశాలల్లో మెరుగైన విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యం….ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులు ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోదాడ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు ఆకాంక్షించారు. పట్టణంలోని 34వ వార్డు ప్రాథమిక పాఠశాలలో స్థానిక కౌన్సిలర్ గంధం బాలేంద్ర, పాండుతో కలిసి ప్రభుత్వం నుంచి సరఫరా అయిన పాఠశాల యూనిఫాంలు, షూలను విద్యార్థులకు అందజేశారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలు, యూనిఫాంలు, షూలు అందజేస్తోందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకొని పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గంధం బాలేంద్ర, పాండు, పంది తిరపయ్య, గుండెపంగు రమేష్, ఏపూరి రాజు, కాంపాటి పుల్లయ్య, కుడుముల రాంబాబు, వెంకటేష్, మహేష్, కృష్ణమూర్తి,తిరుపతయ్య, సైదులు, అజయ్, వంశీ ఉపాధ్యాయులు, వార్డు నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.