పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వర్ల రామయ్య
ప్రజా సంక్షేమానికి పెద్దపీట
భవిష్యత్తులో మరిన్ని పెన్షన్లు పంపిణీ
పేదల అభ్యున్నతికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ ఒకటో తారీకు నాడే విధిగా పెన్షన్లు అందజేస్తున్నామని పెన్షన్లు అందుకుంటున్న ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్సీ వర్ల రామయ్య స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రాంతం చిట్టినగర్ లో పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం స్వయంగా ఆయన నిర్వహించారు.
పెన్షన్లు అందుకుంటున్న ప్రతి ఒక్కరు తమ సంతోషాన్ని వ్యక్తం చేసి తమ జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు పేర్కొన్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రాంత స్థానికులైన శాసనమండలి సభ్యులు వర్ల రామయ్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటన చేశారు. పెన్షన్లు విధిగా అందరికీ అందుతున్న తీరును ఆయన స్వయంగా గమనించి పెన్షన్ దారులతో మాట్లాడారు.
భవిష్యత్తులో మరిన్ని పెన్షన్లు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ వర్ల రామయ్య తమతో నేరుగా మాట్లాడటం ఆయన ఆప్యాయమైన పలకరింపు తమకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని పలువురు పెన్షన్ దారులు తెలియజేశారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST