కెపిహెచ్బి 6th ఫేజ్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

Sakshitha news

కెపిహెచ్బి 6th ఫేజ్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

కెపిహెచ్బి6th ఫేజ్ లోని నేతాజీ గ్రౌండ్స్ లో ఎన్ ఎస్ జి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో టిపిసిసి ఉపాధ్యక్షులు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ పాల్గొని స్థానిక శివాలయంలో పూజలు నిర్వహించి ఉట్టి గొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువనేత మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలు శ్రీకృష్ణుని వేషధారణలో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో బాలాజీ నగర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు రాజేష్ గౌడ్, కే పి హెచ్ పి డివిజన్ అధ్యక్షుడు అరవింద్ రెడ్డి, బాలాజీ నగర్ డివిజన్ మాజీ అధ్యక్షుడు కృష్ణ రాజపుత్, రామారావు గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రంగమోహన్, మాకినేని వినోద్, మందలపు సాయిబాబా చౌదరి, గాదె శివ,లక్ష్మీనారాయణ,నవీన్,బచ్చు మల్లి మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.