కట్టంగూర్ లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంగారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Sakshitha news

నకిరేకల్ :-

కట్టంగూర్ లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

కట్టంగూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ (MRO) కార్యాలయంలో మండలానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం , భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ –

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, పేద కుటుంబాల అభివృద్ధే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా సన్నబియ్యం పొందే వెసులుబాటు కల్పించామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తహసీల్దార్, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.