ఆర్భాటాలు తప్ప ప్రజలకు ఇసుక అందుబాటులో కిరాలేదు
ఉచిత ఇసుక హామీని వెంటనే అమలు చేయాలి
వైసిపి కోవూరు మండల అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి
గతంలో ఉచిత ఇసుక ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ‘ఉచితం’ అనే మాటకే అర్థం లేకుండా చేసిందని విమర్శించారు. పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన వైసీపీ మండల అధ్యక్షుడు అత్తిపల్లి అనుప రెడ్డి వారు మాట్లాడుతూ. ఇసుక సమస్య కారణంగా ప్రజలతో పాటు భవన నిర్మాణ కార్మికులు, ఎడ్లబండ్లపై ఇసుక తరలిస్తూ జీవించే పేద కుటుంబాలకు కూడా ఉపాధి లేకుండా పోయిందన్నారు. వెంటనే హామీ ఇచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసి, ప్రజలకు ఇసుక అందుబాటులోకి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.
చంద్రబాబు నాయుడు బహిరంగ సభలలో మీ ఊరిలో ఇసుక ఉంది ట్రాక్టర్ తీసుకెళ్లి తెచ్చుకోండి ఎవరైనా అడ్డు వస్తే నా పేరు చెప్పండి అని, ఏమీ భయపడక్కర్లేదని, మీకు పూర్తి స్వేచ్ఛ ఉందని బహిరంగ సభలలో ఆర్భాటపు ప్రకటనలు చేశారు. ఆర్భాటాలు తప్ప ప్రజలకు ఇసుక అందుబాటులో రాలేదు ఇచ్చిన హామీ మాటలకే పరిమితమైంది. వెంటనే ఉచిత ఇసుక హామీని అమలు చేసి ప్రజలకు భవన నిర్మాణ కార్మికులకు ఎడ్లబండ్ల కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
