శ్రావణి మట్టి ఖర్చులకు ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా దేవంగ సంక్షేమ సంఘం.
సాక్షిత : కోవూరు మండలం వేగూరు గ్రామం లో నివసిస్తున్న పముజుల శ్రావణి నిన్న వైకుంఠం చేరారు.ఈమె అంతిమయాత్ర కొరకురూ 5వేలు మొత్తం వారి అత్త అయిన పముజుల రమణమ్మ కి నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ద్వారా వారికి అందజేయడం జరిగినది. వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వేగూరు కార్యవర్గ సభ్యులు పడవల వెంకటేశ్వర్లు మరియు వేగూరు దేవాంగ ఆత్మీయులు ఈ అంతిమయాత్ర పథకమునకు సహాయం చేస్తున్న మనసున్న దాతలకు కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియ చేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమానికి తెలిసిన వెంటనే డబ్బులు పంపినందుకు నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం కార్యవర్గానికి మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

