శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి: మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Sakshitha news

శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి: మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్: శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని గణేష్ నగర్ డివిజన్‌లోని చెరుకుపల్లి కాలనీ, పాపయ్య నగర్ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

చెరుకుపల్లి కాలనీలో శ్రీ వంశీకృష్ణ యాదవ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 32 సంవత్సరాలు నుండి నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రీకృష్ణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అదేవిధంగా పాపయ్య యాదవ్ నగర్ లో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లోనూ స్థానిక కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై శ్రీకృష్ణ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, శాంతియుతమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, పరస్పర సహకారం మరింత బలపడాలని, సంస్కృతి సాంప్రదాయాన్ని భవిష్యత్తు తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ దైవభక్తి మార్గంలో నడవాలని సూచించారు..

అదేవిధంగా శ్రీకృష్ణుడి రూపంలో వేషధారణ ధరించిన బాలలతో పాటు కూచిపూడి నృత్యాలు ప్రదర్శించిన చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు..

అనంతరం కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కి శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు..

ఈ కార్యక్రమాల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు గడ్డం రాజేందర్ రెడ్డి, కృష్ణ యాదవ్, వెంకటేష్ యాదవ్, లింగం యాదవ్, ఉత్సవ కమిటీ సభ్యులు కోటేశ్వరరావు,ఎంవీ రావు, జెపి కుమార్, కిషోర్,సురేష్ మరియు పాపయ్య నగర్ కమిటీ సభ్యులు రంగనాథ్, వెంకట్ రావు శ్రీనివాస్ రావు, తిరుమల రాజ్, గాజుల శ్రీనివాస్ లతో పాటు భక్తులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…