కోదాడ పట్టణ బంద్‌ను విజయవంతం చేయాలి: మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్

Sakshitha news

కోదాడ పట్టణ బంద్‌ను విజయవంతం చేయాలి: మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ …
ఆగస్టు 30 : (సాక్షిత న్యూస్) సూర్యాపేట జిల్లా/కోదాడ పట్టణంలో 32 వ వార్డులో పాన్‌ డబ్బా నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద మహిళ గంధం కనకమ్మ పై కోదాడ సీఐ శివ శంకర్ దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ కోరారు. ఆదివారం కోదాడ పట్టణంలో మార్నింగ్‌ వాక్‌లో భాగంగా ప్రజలను కలిసి బంద్‌కు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. పేద మహిళపై దౌర్జన్యంగా వ్యవహరించడం సరికాదని, ప్రజల హక్కులను కాపాడాల్సిన పోలీసులే ఇలా వ్యవహరించడం బాధాకరమని అన్నారు. బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని తెలిపారు. కనకమ్మకు న్యాయం చేయడంతో పాటు ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.