ఆల్ ఇండియా నీట్ ర్యాంక్ 3759 మరియు

Sakshitha news

ఆల్ ఇండియా నీట్ ర్యాంక్ 3759 మరియు
తెలంగాణ స్టేట్ ర్యాంక్ 117 సాధించిన మహతి నీ అభినందించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

బీరప్ప గడ్డ డివిజన్ లో నీ కళ్యాణపురి కాలనీలో నివసించే మహతి షిరాల్కర్ తల్లిదండ్రులు అమిత్ మరియు లలిత కుమార్తె ఆల్ ఇండియా నీట్ ర్యాంక్ – 3759
స్టేట్ నీట్ ర్యాంకు 117 సాధించడం జరిగింది వారి నీటి పర్సంటేజ్ 99.08 కావడం నిజంగా కూడా చాలా అదృష్టం అని, ఈరోజు మహతి ని ఉప్పల్ శాసన సభ్యులు బండారి లక్ష్మారెడ్డి రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ తో కలిసి కళ్యాణపురిలో ని వారి నివాసంలో వారికి నీట్ లో అంత మంచి ర్యాంకు రావడం నిజంగా కూడా చాలా అదృష్టమని వారి చేసిన కష్టానికి ఫలితం అని వారికి అభినందిస్తూ వారికి శాలువాతో సత్కరించి వారి తల్లిదండ్రులను సూపర్ స్టార్ నీ కన్నారని వారిని అభినందించారు.
అనంతరం మహతి విద్యకు సంబంధించిన ఫీజు అంతా కూడా వారు భరిస్తానని వారికి అభయమిస్తూ వారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో కళ్యాణపురి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు టిఆర్ వికాస్ జిఎస్ గణేష్ కుమార్, జెఎస్ ప్రదీప్, సిఎస్ మాధవి రెడ్డి, ఏ ఎస్ ఎన్ మూర్తి, శ్వేత , స్వప్న మొదలగు వారు పాల్గొన్నారు