నీ వాహనం వేగంగా వెళ్తుంది… కానీ నీ జీవితం ఆగిపోతుంది “

Sakshitha news

నీ వాహనం వేగంగా వెళ్తుంది… కానీ నీ జీవితం ఆగిపోతుంది “

రోడ్డు ప్రమాదాల నివారణకై వినూత్న కార్యక్రమం మొదలు పెట్టిన నల్లగొండ జిల్లా పోలీస్ ..

రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరి బాధ్యత జిల్లా యస్పి శరత్ చంద్ర పవార్ ఐపీయస్

రోడ్డు ప్రమాదాల నివారణకు నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ వినూత్న కార్యాక్రమం ద్వారా వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్నారు.

నేషనల్ హైవే 65, చిట్యాల మండలం వెలిమినేడు వద్ద “నీ వాహనం వేగంగా వెళ్తుంది.. కానీ నీ జీవితం ఆగిపోతుంది” అనే నినాదం ద్వారా యాక్సిడెంట్ కి గురైన కారును చూపుతూ హోల్డంగ్ ఏర్పాటు చేసి వాహనచోదకులకు అవగాహన కల్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా యస్పి  మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.వాహన చోదకులు  అతివేగం తో ప్రయాణించడం, సీట్ బెట్టు పెట్టుకోవడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, రాంగ్ రూట్లో ప్రయాణించడం మద్యం తాగి వాహనాలు నడపటం లాంటి అనేక తప్పిదాల వల్ల నిత్యం అనేక ప్రమాదాలకు గురై ఎంతో మంది క్షతగాత్రులు,మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. వాహన చోదకులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఇలాంటి హోల్డింగులు చూడడం వల్లన వేగ పరిమితి మించకుండా, సీట్ బెల్ట్, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకుండా ఉండుటకు అవగాహన కలిగి ఉంటారని తద్వారా ప్రమాదాలను నివారించవచ్చునని అన్నారు.వాహన దారులు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ రోడ్డుపైన ఉన్నటువంటి సూచికలను గమనిస్తూ సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని సూచించారు. జిల్లా పోలీస్ శాఖ తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలు గుర్తించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రమాదాలు జరుగుటకు గల కారణాలు తెలుసుకొని వెంటనే తగు నియత్రణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి, చిట్యాల సిఐ నాగరాజు, చిట్యాల ఎస్ఐ మధు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top