గత పది సంవత్సరాల నుండి క్లెయిమ్ చేయకుండా

Sakshitha news

గత పది సంవత్సరాల నుండి క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన తమ బ్యాంకు డిపాజిట్లు, బీమా, మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్ షేర్ లు తదితర డబ్బులు తిరిగి పొందేందుకు సువర్ణావకాశం
డిసెంబర్ 24న ఐ.డి. ఒ .సి సమావేశ మందిరంలో మీ డబ్బు మీ హక్కు కార్యక్రమం
బ్యాంకులు, బీమా సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకరేజ్ సంస్థలతో ఉమ్మడి శిబిరం ఏర్పాటు – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
…..

సాక్షి త వనపర్తి :
ఎప్పుడో బ్యాంకులో డబ్బులు జమ చేసి మరచిపోవడం, బీమా, మ్యూచువల్ ఫండ్, డివిడెంట్ లు, స్టాక్ మార్కెట్ షేర్లు తదితర డబ్బులు తిరిగి పొందేందుకు రిజర్వు బ్యాంక్ ఆదేశాల మేరకు అక్టోబర్ 1 నుండి మరో అవకాశం కల్పించిందని అందులో భాగంగానే వనపర్తి జిల్లాలో ఉమ్మడి శిబిరం ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ నేడొక ప్రకటనలో తెలిపారు.

డిసెంబర్ 24న ఐ.డి. ఒ.సి. సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఉమ్మడి శిబిరం పనిచేస్తుందని, 10 సంవత్సరాలకు పైబడిన మరచిపోయిన లావాదేవీలు పొందేందుకు శిబిరంలో జిల్లా లోని బ్యాంకులు, బీమా సంస్థలు, డివిడెంట్ లు, స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ లు పాల్గొంటారని, వనపర్తి జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ డబ్బును క్లెయిమ్ చేసుకోవాల్సిందిగా సూచించారు. 10 సంవత్సరాలకు పైబడిన బ్యాంకు ఖాతాలు, డిపాజిట్ల వివరాలు తెలుసుకునేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్గం వెబ్సైట్ ( https://udgam.rbi.org.in) ద్వారా తెలుసుకోవచ్చని తెలియజేశారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ

Scroll to Top