అందరికీ అండగా ఉంటా.
మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్.
అలంపూర్ సాక్షిత : మర్యాదపూర్వకంగా సంపత్ కుమార్ ని కలిసి సత్కరించిన 15 వ వార్డ్ కౌన్సిలర్ గోరంట్ల సులోచనమ్మ గోరంట్ల రవీంద్ర.
హైదరాబాద్ లోని ఎ ఐ సి సి కార్యదర్శి అలంపూర్ మాజీ శాసనసభ్యులైన డాక్టర్ SA సంపత్ కుమార్ నివాసంలో
15వ వార్డ్ కౌన్సిలర్ గోరంట్ల సులోచనమ్మ గోరంట్ల రవీంద్ర దంపతులు సంపత్ కుమార్ ని కలిసి మర్యాదపూర్వకంగా శాలువా పూలమాలతో సత్కరించారు. వార్డులో ఉన్న పలు సమస్యలను సంపత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో సత్వరమే అన్ని విధాల ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి దేవేందర్, నరేంద్ర వర్మ తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY