కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎక్కడ

Sakshitha news

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎక్కడ

బిజెపి మండల అధ్యక్షుడు గుగులో శంకర్ నాయక్ సూటి ప్రశ్న

సాక్షిత : భారతీయ జనతా పార్టీ నిర్వహించబోతున్న స్థానిక ప్రజల సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాల పైన భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గూగులోత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు.జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి,జిల్లా సీనియర్ నాయకులు ఎడ్లపల్లీ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి మోసం చేశారని,స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పట్టించుకోకుండా పాలకుల పరిపాలిస్తున్నారని, మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలన్నీ పారిశ్రుద్యం పడకేసిందని గ్రామాల్లో వీధిలైట్లు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిన పాలకులు ప్రజల సమస్యను పట్టించుకోకుండా గాలికి వదిలేసినారు.సీతారామ ప్రాజెక్టు నుండి వస్తున్న నీళ్లను ములకలపల్లి మండల ప్రజలకు రైతులకు పంటల కోసం ఏర్పాటు చేయాలి, గిరిజనులు సాగు చేస్తున్న పోడుభూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి,కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కౌలు రైతులకు 12 వేల ఇవ్వాలి, ప్రధాన రహదారి పూసుగూడెం నుండి కొత్తూరు వరకు సీతారామ ప్రాజెక్టు వల్ల లారీలు పోయి పాడైపోయిన రోడ్లను వెంటనే ఏర్పాటు చేయాలి,కొమ్ముగూడెం లొ అంగన్వాడి సెంటర్ కేంద్రం పూర్తి స్థాయిలో నిర్మించక ఆగిపోయింది దానికి వెంటనే ఏర్పాటు చేయాలి,గ్రామాల్లో వీధి కుక్కలు వల్ల సమస్యలు బాగా ఉన్నాయి.మండల స్థాయిలో గ్రామాలాల్లో వీధి కరెంటు స్తంభాలు లేవు,కరెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలి,ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాకుండా అర్హులైన పేదలకి ఇందిరమ్మ ఇల్లు అందరికి మంజూరయ్యే విధంగా వాలంటీర్లు కాకుండా అధికారులే చర్యలు తీసుకోవాలి,గిరిజనులకు పోడు భూముల రైతులకు కరెంట్ లైన్ ఏర్పాటు చేసి ఐటిడిఎ ద్వారా మోటార్లను ఏర్పాటు చేయాలి, గ్రామాల్లో పారిశుధ్యం లేక గడ్డి పెరిగిపోయి కాలువ తీయలేక నీళ్లు ఎక్కడికక్కడ జామ్ అయిపోయి దోమలు ఏర్పడి విష జ్వరాలు వస్తున్నాయి కావున వాటిపై అధికారులు దృష్టి పెట్టాలి అన్నారు.ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ నెంబర్ అనుముల శ్రీనివాస్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఎడ్లపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు పూనెం నవీన్ కుమార్,అత్యం మణికంఠ సాయి,బానోత్ మల్లేష్,చీకటి ప్రకాష్,అర్చన రంగారావు, తోట వెంకటేశ్వర్లు,ఎర్రంశెట్టి శ్రీనివాస్, తేజావత్ పార్వతి, సుధారాణి, తులసి,సక్క,విజయ పాల్గొన్నారు.