మారిసస్ ప్రధానికి “తుడ” చైర్మన్ స్వాగతం
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: మారిసస్ ప్రధానమంత్రి నవీన్‌చంద్ర రాంగుళం తిరుపతికి విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన తిరుపతి సమీపంలో ఉన్న రామాపురం లోని బ్రహ్మ రిషి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమం సిద్దేశ్వర బ్రహ్మశ్రీ గురుజితో కలసి “తుడ” చైర్మన్ అండ్ టీటీడీ బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి ఘన స్వాగతం పలికి “ద డివైన్ మాస్టర్” పుస్తకాన్ని బహుకరించారు.
