నూతనంగా నిర్మించినఏదుల, రేవల్లి మండలా ల తాసిల్దార్ కార్యాలయాలను సందర్శించిన……. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
సాక్షిత వనపర్తి
ఏదుల, రేవల్లి మండలాల్లో నూతనంగా నిర్మించిన తహసిల్దార్ కార్యాలయ భవనాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఏదుల, రేవల్లి మండలాల్లో పర్యటించారు. ఆయా మండలాల్లో నూతనంగా నిర్మించి, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న తహసీల్దార్ కార్యాలయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయ భవనాల నిర్మాణ నాణ్యత, సౌకర్యాలను సమీక్షించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఏదుల, రేవల్లి మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాలను నూతనంగా నిర్మించిన భవనాలకు షిఫ్ట్ చేసి, అక్కడ నుంచే ప్రజలకు సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నూతన భవనాల్లో ఫర్నిచర్ ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తహసీల్దార్లకు ఆదేశించారు.
ఈ నూతన కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సేవలు అందేలా నూతన కార్యాలయాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఏదుల తహసిల్దార్ మల్లికార్జున్, రేవల్లి తహసిల్దార్ సరస్వతి, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY