రంజాన్ పర్వదిన ముస్లిం సోదర – సోదరీమణులకు శుభాకాంక్షలు – తెలిపిన వేమిరెడ్డి దంపతులు
నెల్లూరు జిల్లా రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు క్షేమాన్ని, ఆయురారోగ్యాలను అల్లాహ్ ప్రసాదించాలని ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ఆకాంక్షించారు. శనివారం రంజాన్ సందర్భంగా జిల్లా ముస్లిం సోదర సోదరీమణులకు, ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలు, క్షమ, దాన ధర్మాలను ఆచరించి అల్లా ఆసీసులు అందుకున్నారని చెప్పారు. రంజాన్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, ప్రతి ఇంటా సిరిసంపదలు వెల్లివిరియాలని కోరారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY