వేమన పద్యాలు.. సామాజిక చైతన్య దీపికలు
- జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ
ప్రజాకవి, సంఘ సంస్కర్త యోగి వేమన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని.. ఆయన పద్యాలు సామాజిక చైతన్యానికి ప్రతీకలు అని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు.
యోగి వేమన జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులతో కలిసి యోగి వేమన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సామాజిక చైతన్యంతో కూడిన వేమన పద్యాల సాహిత్య ఔన్నత్యాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జేసీ ఇలక్కియ మాట్లాడుతూ సమాజంలోని వివిధ సమస్యలను భిన్న కోణాల్లో స్పృశించి.. వేమన తన పద్యాల్లో విలువలను చొప్పించారని పేర్కొన్నారు. నేటి తరానికి యోగి వేమన జీవితం, శతక సాహిత్యం గురించి అవగాహన పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సరళ భాషలో, ఉదాహరణలతో వేమన పద్యాలు ప్రతి ఒక్కరి హృదయాలను స్పందింపజేస్తాయని జేసీ ఇలక్కియ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
(డీఐపీఆర్‌వో, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY