ప్రభుత్యం గిగ్, ప్లాట్ ఫామ్ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని ఆగస్టు 8నుండి నిరవధిక నిరాహార దీక్ష, సమ్మెకు సంఘాల పిలుపు

Sakshitha news

ప్రభుత్యం గిగ్, ప్లాట్ ఫామ్ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని ఆగస్టు 8నుండి నిరవధిక నిరాహార దీక్ష, సమ్మెకు సంఘాల పిలుపు

కార్మికుల వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్

సాక్షిత వనపర్తి
2026 ఆగస్టు 8 నుండి ప్రారంభం కానున్న నిరవధిక సమ్మెకు, గిగ్ మరియు ప్లాట్‌ఫామ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తెలంగాణ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి.
ఓ పత్రిక ప్రకటనలో తెలిపారు
ప్రధాన డిమాండ్లు:

అన్ని యాప్ ఆధారిత క్యాబ్ మరియు ఆటో సేవలకు ప్రభుత్వం కనీస ప్రాథమిక ఛార్జీతో పాటు కిలోమీటరుకు, నిమిషానికి న్యాయమైన రేట్లను నిర్ణయించాలి.

తెలంగాణ గిగ్ మరియు ప్లాట్‌ఫామ్ కార్మికుల నియమాలను వెంటనే నోటిఫై చేసి, గిగ్ మరియు ప్లాట్‌ఫామ్ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి.

ప్లాట్‌ఫామ్ కంపెనీలు ఏకపక్షంగా ఛార్జీలను నిర్ణయించే విధానానికి ముగింపు పలికి, మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు–2025 ప్రకారం ప్రభుత్వం కనీస ప్రాథమిక ఛార్జీలను అధికారికంగా నోటిఫై చేయాలి.

ఇది కేవలం న్యాయమైన ఆదాయం కోసం చేసే పోరాటం మాత్రమే కాదు—లక్షలాది గిగ్ మరియు ప్లాట్‌ఫామ్ కార్మికుల గౌరవం, జీవనోపాధి, సామాజిక భద్రత కోసం జరుగుతున్న ఉద్యమం.

న్యాయం జరిగితే సమ్మె అవసరం లేదు.న్యాయం జరగకపోతే 2026 ఆగస్టు 8 నుండి నిరవధిక సమ్మె తప్పదు.

తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరం (టీఏడీఎఫ్). తెలంగాణ గిగ్ మరియు ప్లాట్ ఫామ్ వర్కర్స్ యూనియన్ ( టీజీపిడబ్ల్యుయు).
నాయకత్వంలో నిర్వహిస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు మా
మహా జన కార్మిక సంఘాల సమాఖ్య MFTU సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాము .

Scroll to Top