టీటీడీ ఈఓతో “తుడ” చైర్మన్ భేటీ

Sakshitha news

టీటీడీ ఈఓతో “తుడ” చైర్మన్ భేటీ

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుమల – తిరుపతి దేవస్థానంల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ తో “తుడ” చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈమేరకు తిరుపతి ఏడీ బిల్డింగ్ లో సింఘాల్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో తుడా పరిధిలో చేపట్టవలసిన అధివృద్ధి పనులను గురించి తుడా చైర్మన్ ఈఓకు వివరించారు.
తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కల్పించవలసిన సౌకర్యాల గురించి, వైకుంఠ ఏకాదశి పర్వదినానికి చేపడుతున్న ఏర్పాట్లు, సౌకర్యాల గురించి ఈ భేటీలో చర్చించారు.

Scroll to Top