శనగపాడు గ్రామంలో రైతులకు స్మార్ట్ అగ్రికల్చర్‌పై శిక్షణ కార్యక్రమం

Sakshitha news

శనగపాడు గ్రామంలో రైతులకు స్మార్ట్ అగ్రికల్చర్‌పై శిక్షణ కార్యక్రమం

పెనుగంచిప్రోలు,
పెనుగంచిప్రోలు మండలం శనగపాడు గ్రామంలోని గ్రామీణ కృషి పరిజ్ఞాన కేంద్రం (GKPK) లో స్మార్ట్ అగ్రికల్చర్ కార్యక్రమంలో భాగంగా రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ScaNxt కంపెనీ ప్రతినిధులు రైతులకు భూ పరిశోధన కిట్ (Bhu Parikshak Kit) ను ఉపయోగించి నేల పరీక్షలు ఎలా చేయాలి, ఆ పరీక్షల ఆధారంగా స్మార్ట్ అగ్రికల్చర్ పద్ధతులను ఎలా అమలు చేయాలి అనే విషయాలపై ప్రత్యక్షంగా ప్రదర్శన (డెమో) ఇచ్చి శిక్షణ అందించారు. ఈ శిక్షణ ద్వారా రైతులు తమ భూమి యొక్క పోషక స్థితిని తెలుసుకొని సరైన ఎరువుల వినియోగంతో పంటల దిగుబడిని పెంచుకోవచ్చని వివరించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కీసర సైదులు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో స్మార్ట్ అగ్రికల్చర్ కార్యక్రమాలను GKPK కేంద్రంలో విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆధునిక వ్యవసాయ పద్ధతులను నేర్చుకోవాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సుబ్బారెడ్డి , Aspirational Blocks Coordinator మోహన్ సందీప్, ScaNxt మేనేజర్ జె.ఎన్.వి.ఎస్.వి ప్రసాద్ , గ్రామ వ్యవసాయ సహాయకుడు బచ్చలకూరి. రాంబాబు ,మరియు గ్రామ రైతులు

Scroll to Top