బిసి బంద్ లో అగ్ర పార్టీ నాయకులు జాడే లేదు

Sakshitha news

బిసి బంద్ లో అగ్ర పార్టీ నాయకులు జాడే లేదు!
42శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలి.

టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి వట్టే. జానయ్య యాదవ్
….

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: జిల్లా కేంద్రం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ అగ్ర పార్టీ నాయకుల తీరును తీవ్రంగా తప్పుపట్టాడు. ఈనెల 18వ తారీఖున బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్ కు అగ్ర పార్టీ నాయకులు ఎక్కడ ఉన్నారు? బంద్ లో ఎందుకు పాల్గొనలేదనీ, రాజకీయ పార్టీలు పార్టీ నాయకులు బీసీ సమాజానికి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందనీ అన్నారు. కేవలం పత్రిక ప్రకటనలకు మాత్రమే బీసీ బందులో పాల్గొంటామని చెప్పి బందులో పాల్గొనక పోవడం వెనుక మర్మమేమీటో బీసీ సమాజానికి చెప్పాలని అన్నారు. నేటికైనా అగ్ర పార్టీ నాయకులు ఆడుతున్న ఆటలలో బీసీ నాయకులు కీలుబొమ్మలు కావద్దని
42 శాతం రిజర్వేషన్లు ఎలా సాధ్యమైతుందని ఆనాడే శాసనమండలిలో మా పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న తప్పు పట్టడం జరిగింది. జీవో నెంబర్ 9 ని కూడా తీవ్రంగా తప్పు పట్టడం జరిగింది. హైకోర్టు లో జీవో నెంబర్ తొమ్మిదిని సస్పెండ్ చేయగానే మా పార్టీ ఆధ్వర్యంలో బంద్ కు ప్రకటించాము. కానీ మిగతావారు ఆ రోజు బందులో పాల్గొనకుండా 18 వ తారీకు బంద్ ఇవ్వడం రాష్ట్రంలో పాక్షికంగానే బంద్ ప్రభావం కనిపించింది. ఎక్కడ కూడా పూర్తిగా బంద్ అయిన దాఖలాలు లేవని 42% రిజర్వేషన్లు కల్పించే వరకు రాజ్యాధికార పార్టీ పోరాడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీ అర్ పి నాయకులు చాంద్ పాషా,మీర్ అక్బర్ , కుంభం నాగరాజు , అన్నపర్తి రాజేష్, ఆవుల అంజయ్య, శివ , బొమ్మగాని సైదులు గౌడ్, వల్లాల సైదులు, సైదులు, మల్లేష్, , సుమన్, కోటి, వల్లాల బుచ్చయ్య, గుంటూరు విజయ్, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.