జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి….
- జిల్లా కలెక్టర్ కోయ హర్ష….
సాక్షిత పెద్దపల్లి// . జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఒక ప్రకటనలో తెలిపారు.
జాతీయ కుటుంబ ప్రయోజనం పథకం (NFBS) నో అర్హులైన వారు పంచాయతీ కార్యదర్శి, ఎంపిడిఓ కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయం లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. బి.పి.ఎల్ కుటుంబాలలో కుటుంబాన్ని పోషించే ప్రధాన వ్యక్తి 18 నుంచి 60 సంవత్సరాల వయసు గలవారు మరణిస్తే వారు కుటుంబానికి ఈ పథకం కింద 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు.
ఈ పథకానికి సంబంధించి మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇతర ఆర్థిక సహాయాలు అందకుండా ఉండాలని , అప్పుడే ఈ పథకం అమలు అవుతుందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
