వ్యవసాయ మోటార్ విద్యుత్తు తీగలు చోరీ
సాక్షిత : నాదెండ్ల మండలం సాతులూరు పొలాల్లోని ఓ రైతుకు చెందిన వ్యవసాయ మోటార్ కరెంటు తీగలను చోరులు అపహారించిన సంఘటన చోటుచేసుకుంది
వజ్జా లింగయ్య అనే రైతుకు చెందిన వ్యవసాయ భూమిలోని బోరు మోటారు విద్యుత్తు తీగలను రాత్రి దొంగలు అపహారించారు.
సుమారు రూ. 6వేల విలువైన విద్యుత్తు తీగలను దొంగలించడంతో బాధిత రైతు లింగయ్య ఆవేదనకు గురైయ్యాడు
. నాదెండ్ల, గణపవరం పొలాల్లో ఇటీవల ట్రాన్స్ ఫార్మర్లు, సోలార్ పరికరాలు చోరీకి గురై రైతులు పంటల సాగుకి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.

ఈ చోరీ ఘటనపై పోలీసులు చర్య తీసుకొని, దొంగలను పట్టుకొని రైతులకు న్యాయం చేయాలని గ్రామీణులు కోరుతున్నారు.