అడుగడుగునా విస్మరణ, వివక్షతకు గురైన తెలంగాణ ప్రజల ఆగ్రహజ్వాల నుంచి ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని దశాబ్ద కాలంలోనే అగ్రపదాన నిలిపిన మహా నాయకుడు కేసీఆర్ : బిఆర్ఎస్ నాయకులు….
సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని చింతల్లోని ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ కార్యాలయంలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన బిఆర్ఎస్ శ్రేణులు పాల్గొని జాతీయ జెండాతో పాటు బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. అడుగడుగునా విస్మరణ, వివక్షకు గురైన తెలంగాణ ప్రాంత ప్రజల ఆగ్రహ జ్వాల నుంచి రగిలిన ఉద్యమం… మారుమూల ప్రాంతం నుంచి ఢిల్లీకి తెలంగాణ సెగ తగిలేలా ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహోన్నత నాయకులు కెసిఆర్ గారని అన్నారు. 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిపరిచి తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిన ఘనత బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
అనంతరం రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా పనిచేయాలంటూ నిర్వహించిన ప్రతిజ్ఞ కార్యక్రమంలో….. నాయకులు, కార్యకర్తలు “రెండేళ్లలో కాలంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోక అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన నయవంచక పాలనలో మన రైతాంగంతో పాటు అన్నీ వర్గాల ప్రజలు కష్టాల పాలవుతున్నారు. ఈ విపత్కర పరిస్థితిలో తెలంగాణ ఆస్తిత్వ రక్షనే ప్రధమ కర్తవ్యంగా భావిస్తూ, మరో ప్రజా పోరాటానికి సిద్ధమవుతూ నన్ను నేను పునరంకితం చేసుకుంటూ తెలంగాణ తల్లి సాక్షిగా కుంటుపడిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తిరిగి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోనే సాద్యమని, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యతిరేకుల కుట్రలను చెందిద్దాం…. మన తెలంగాణను రక్షించుకుందాం… అని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పనిచేస్తామని” ప్రతిజ్ఞ చేశారు.
ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు డివిజన్ లకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల సభ్యులు
తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
