ప్రభుత్వ పాఠశాలల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందిస్తున్న పథకాలు వందశాతం అమలు చేయడమే కాకుండా ఆన్లైన్ లో డేటా అప్డేట్చేయాలి
జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
సాక్షిత వనపర్తి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు అందిస్తున్న అన్ని పథకాలు అమలు చేసి విద్యార్థులకు వందశాతం లబ్ధించేకుర్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యా శాఖ అధికారులు, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి, వైద్య శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులను యుడైస్ ఆన్లైన్ డేటాతో సమీక్ష నిర్వహించారు. మౌలిక సదుపాయాల్లో భాగంగ ఎన్ని పాఠశాలలలో ఇంటర్నెట్ సౌకర్యం లేదు, విద్యుత్ కనెక్షన్ లేని స్కూల్, మరుగుదొడ్లు లేనివి ఎన్ని, ప్రహరీ గోడ లేనివి ఎన్ని, కిచెన్ షెడ్ లేని పాఠశాలలు ఎన్ని అనే వివరాలను పోర్టల్ వివరాలతో సరిచూసుకుని సమీక్ష నిర్వహించారు.
చాలా పాఠశాలల్లో సదుపాయాలు ఉన్నప్పటికినీ యుడైస్ పోర్టల్ లో నమోదు చేయని కారణంగా రాష్ట్రంలో వనపర్తి జిల్లా వెనకబడి ఉన్నట్లు చూపిస్తుందని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా శాఖలో సిబ్బంది చాలా అలసత్వం ప్రదర్శిస్తున్నారని పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇంటర్నెట్ లేని ప్రభుత్వ పాఠశాలల్లో వెంటనే ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేసి ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేయాలని ఆదేశించారు. కొంతమంది విద్యార్థులకు ఇంకా ఆధార్ కార్డు పొందలేదని, ఆధార్ కార్డు లేని విద్యార్థుల డేటా పాఠశాల, మండలం వారిగా ఇవ్వాలని వారికి త్వరలోనే ఆధార్ కార్డు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ప్రధానమంత్రి పోషణ్ స్కీమ్ ను జిల్లాలో వందశాతం అమలు చేసి అన్ని మౌలిక వసతులు సమకూర్చుకోవాలని సూచించారు.
మరుగుదొడ్లు, ప్రహరీ, కిచెన్ షెడ్ లు, కిచెన్ గార్డెన్ లు ఎక్కడెక్కడ లేవో వివరాలు ఇస్తే గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఒక పాఠశాల నుండి టి.సి పొందిన విద్యార్థి తిరిగి ఏ పాఠశాల, కళాశాలలో చేరారో ఆన్లైన్ డ్రాప్ బాక్స్ డేటా లో నమోదు చేయాలని, వనపర్తి జిల్లాలో 5157 మంది విద్యార్థుల డేటా నమోదు చేయబడలేదన్నారు. వెంటనే డేటా నమోదు చేయాలని ఆదేశించారు.
*మధ్యాహ్న భోజనం అందించే అన్ని ప్రభుత్వ పాఠశాలలు తప్పనిసరిగా ఎల్.పి.జి సిలిండర్లు వాడాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ నిధుల నుండి ఎల్. పి.జి సిలిండర్లు ఇప్పించడం జరుగుతుందని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లై అధికారిని ఆదేశించారు. సిలీండర్ తీసుకున్నాక కట్టెల పై వంట చేస్తే మాత్రం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా పాఠశాలల్లో వండిన వంటకాల నాణ్యత ప్రమాణాలు నిబంధనల ప్రకారం చెక్ చేసి రిపోర్టు ఆన్లైన్ లో నమోదు చేయాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులు, వంట మనుషులను వైద్య పరీక్షలు నిర్వహించి రిపోర్టు అప్లోడ్ చేసి వనపర్తి జిల్లాకు అన్ని ప్రమాణాల్లో మంచి పేరు తీసుకురావాలని ఆదేశించారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, జిల్లా విద్యా అధికారి అబ్దుల్ ఘని, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి అంజయ్య, పి.డి. డీఆర్డీఓ ఉమా దేవి, జిల్లా వైద్య అధికారి డా శ్రీనివాసులు, అసిస్టెంట్ డైరెక్టర్ కవిత, జి.సి.డి.ఓ శుభలక్ష్మి, యం. ఈ.ఓ లు తదితరులు పాల్గొన్నారు.
