ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

Sakshitha news

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి-ఎస్టీయు
రాష్ట్ర ఉపాధ్యాయ సంఘము (STU) వార్షిక కౌన్సిల్ సమావేశం సందర్భంగా ఈ రోజు చిలకలూరిపేట పట్టణం లోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయo లో జరిగిన సమావేశం ఉద్దేశించి రాష్ట్ర ఆర్ధిక కార్యదర్శి కే కోటేశ్వరరావు ఎస్టియు రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటుశ్రీనివాసరావు మాట్లాడుతూఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజాం నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యల సాధన కోసం ఆవిర్భవించిన సంఘము
ఎస్టీయూ అని అన్నారు.. ఉపాధ్యాయ ఉద్యమ ప్రస్థానం లో 79సంవత్సరాలు దిగ్విజయం గా పూర్తి చేసుకొని, ఉద్యమాలు పోరాటాలే స్పూర్తి గా (STU )రాష్ట్రోపాధ్యాయ సంఘం అని అన్నారు. ఉపాద్యాయ ఉద్యమాలకు మాతృక. ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాడే ఏకైక సంఘం రాష్ట్ర ఉపాద్యాయ సంఘము. అని అన్నారు ఈ రోజు ఉపాధ్యాయులు పొందుతున్న అనేక సౌకర్యాల కల్పన కోసం అనేక ఉద్యమాలు రూపొందించి ముందుండి ఎస్టీయూ నాయకులు నడిపించారు. అనేక ఉద్యమాల ద్వారా,. పాఠశాలల పరిరక్షణకై కృషి చేస్తూ, ఉపాధ్యాయులకు మొట్టమొదటిసారిగా డి ఏ సాధన పిఆర్సి కమిటీ సాధన రీ గ్రూప్ ఇన్ స్కూల్ సాధన వంటి అనేక సమస్యల పట్ల ఏపీ జేఏసీలో ప్రముఖ పాత్ర వహిస్తూ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉద్యమాలకు సంపూర్ణ మద్దతునిస్తూ అనేక ఉద్యమాలకు పోరాటాలకు స్ఫూర్తినిచ్చిన సంఘం ఎస్టియు అని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ గందరగోళo నుండి నివారించాలని కోరారు .

పెండింగ్లో ఉన్న డి ఏ బకాయిలు పిఆర్సి బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఎస్టియు డిమాండ్ చేస్తుందని తెలిపారు. ఉపాధ్యాయులపై యాప్ ల భారాన్ని తొలగించాలని. మూల్యాంకనం పుస్తకాలు నిర్వహణ పున పరిశీలించాలని, మున్సిపల్ ఉపాధ్యాయులకు ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లకు వెంటనే ప్రారంభించాలని. కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ వర్తింపచేయాలని ఎస్టీయూ డిమాండ్ చేస్తుందని తెలిపారు


2025 మెగా డీఎస్సీ పూర్తయిన విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులు నిర్మించినందున పాఠశాలలో బోధన ఇబ్బందికరంగా మారినందున అకాడమిక్ ఇన్స్పెక్టర్లను నియమించాలని విద్యాశాఖ వెంటనే చూపాలని ఎస్టియు డిమాండ్ చేస్తున్నాయి తెలిపారు అనంతరం చిలకలూరిపేట నాదెండ్ల ఎడ్లపాడు మండలాలు చిలకలూరిపేట పట్టణానికి సంబంధించి నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించడం జరిగింది పల్నాడు జిల్లా కార్యదర్శి వినుకొండ అక్కయ్య,జిల్లా మహిళా కన్వీనర్ యం శారద, సీనియర్ నాయకులు చావలి మల్లేశ్వరరావు,గేరా నాగేశ్వరరావు, చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులుగా మేకల కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి గా వడ్లన అజయ్ ప్రకాష్ చిలకలూరిపేట మండల అధ్యక్షులుగా షేక్ మస్తాన్ వలి, ప్రధాన కార్యదర్శి గా వడితే రమణ నాయక్, ఆర్ధిక కార్యదర్శి గా నూనె నానీ జేష్ఠ విజయ కుమార్. రాంజీ నాయక్.యడ్లపాడు మండల అధ్యక్షులు గా జి కోటేశ్వరరావు. ప్రధాన కార్యదర్శి గా సతీష్ కుమార్, నాదెండ్ల మండల అధ్యక్షులు గా షేక్ మాక్బుల్ బాషా. ప్రధాన కార్యదర్శి గా దుర్గా ప్రసాద్. ఆర్ధిక కార్యదర్శి గా వెంకటేశ్వర్రావు పట్టణ నాయకులు ఈ కార్యక్రమంలో అన్ని మండలాల,పట్టణ ఎస్టీయూ నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top