కాంగ్రెస్ లో చేరిన పెబ్బేరు మున్సిపాలిటీ బిఆర్ఎస్ ప్రధాన నాయకులు
సాక్షిత వనపర్తి
పెబ్బేరు మున్సిపాలిటీకి చెందిన మాజీ ఎంపిటిసి, మాజీ కోఆప్షన్, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్, మాజీ వార్డు సభ్యుడు అయిన ఐజాక్ తో పాటు BRS ముఖ్య నాయకులు ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ గంధం వెంకటయ్య, నరేందర్ లు బుధవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి , DCC అధ్యక్షులు శివసేన రెడ్డి లసమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు
కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉన్న సమయంలో మీరు రావడం అభినందనీయమని రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించేందుకు మీరు మనస్ఫూర్తిగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత BRS హయంలో పదవుల్లో ఉన్నామే తప్ప ఎలాంటి గౌరవ మర్యాదలు ఉండేవి కావని నేను కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో ప్రభుత్వ పథకాలు ప్రతి నిరుపేద కందుతున్నాయని ఆకర్షితులమై నేడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వారు పేర్కొన్నారు
కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
