రాష్ట్ర సంపదను ప్రజలందరికీ పంపిణీ జరగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోంద

Sakshitha news

రాష్ట్ర సంపదను ప్రజలందరికీ పంపిణీ జరగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోంద………. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

సాక్షిత వనపర్తి,: రాష్ట్రంలో సృష్టిస్తున్న సంపదను సమానత్వం, సామజిక న్యాయం ప్రాతిపదికగా ప్రజలందరికీ పంపిణీ జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తూ, సకలజనుల సంక్షేమానికి పాటుపడుతున్నదని చీఫ్ విప్, తెలంగాణ శాసనమండలి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.

             జూన్ 2, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం వనపర్తి జిల్లాలోని ఐ.డి.ఓ.సి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ వేడుకలకు పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.
       
         అంతకుముందు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యఅతిథి పోలీస్ శాఖ ద్వారా ఇచ్చిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం  వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన లక్ష్యాల పై  ప్రగతి నివేదికను చదివి వినిపించారు. 
    
     ముఖ్య అతిథి ప్రసంగం:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇట్టి వేడుకలకు హాజరైన పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు, కలెక్టర్ కి, అదనపు కలెక్టర్లకు, జిల్లా న్యాయమూర్తులకు, జిల్లా ఎస్పీ, ఇతర ప్రజాప్రతినిధులకు, వివిద శాఖల జిల్లా అధికారులకు, విద్యార్థులకు, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, పుర ప్రముఖులకు నా హృదయ పూర్వక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ  దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.

రాష్ట్రంలో సృష్టిస్తున్న సంపదను సమానత్వం, సామజిక న్యాయం ప్రాతిపదికగా ప్రజలందరికీ పంపిణీ జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తూ, సకలజనుల సంక్షేమానికి పాటుపడుతున్నదన్నారు. ప్రణాళికాబద్దమైన విధానాలు, ఆర్ధిక క్రమ శిక్షణ, అందరి సహకారంతో అన్ని రంగాలలో ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు.

ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం మార్చి 6 నుండి జూన్ 12 వరకు నిర్వహించ తలపెట్టినందున జిల్లాలో ఇప్పటివరకు 9 అంశాలు అనగా పరిశుభ్రత, ఆరోగ్యం, రహదారి భద్రత అరైవ్ – అలైవ్, సంక్షేమ పధకాల అమలు, పిల్లల భద్రత, నో-డ్రగ్స్ ప్రచారం, రైతు సంక్షేమం, విద్యా, ఉపాధి అవకాశాలు, యువత, క్రీడలకు ప్రోత్సాహం, మహిళా శిశు సంక్షేమం కార్యక్రమాలు చేపట్టి ప్రజలలో ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల వివరాలు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయి సమావేశాలలో ప్రజలకు వివరించడం జరిగిందన్నారు.

మన రాజ్యాంగంలో పొందుపర్చినట్లు మన తెలంగాణ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం మరియు సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో 6 గ్యారెంటీలను ప్రకటించడం జరిగింది. ఆ దిశగా ప్రభుత్వం వివిద రకాల సంక్షేమ పథకాలను అమలుపరుస్తుందని తెలిపారు.

మహాలక్ష్మి పథకం మహిళలకు వరం
ఈ ప్రభుత్వం ప్రతి మహిళలను మహాలక్ష్మిగా చేయాలనే సంకల్పంతో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. జిల్లాలో ఇప్పటివరకు 3 కోట్ల 48 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. ఇందుకు గాను రూ.146.24 కోట్లను ప్రభుత్వం భరించిందన్నారు.

మహిళా శక్తి పధకము కింద మండల మహిళా సమాఖ్యల ద్వారా 12 R.T.C బస్సులను కొనుగోలు చేసి R.T.C కి అద్దెకు ఇవ్వడం జరిగిందన్నారు. వీటి ద్వారా ప్రతి మండల మహిళా సమాఖ్యకు నెలకు దాదాపుగా 69 వేల చొప్పున మొత్తం రూ.8 లక్షల 33 వేలు ఆదాయం వారికి లభిస్తుందని తెలిపారు.

రూ. 500లకే వంటగ్యాస్ సరఫరా
నానాటికీ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం పేద ప్రజల పై పడరాదన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం రూ.500 కే వంటగ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. జిల్లాలో 85 వేల మందికి 3,71,068 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను ప్రభుత్వం 11 కోట్ల 5 లక్షల వ్యయం అందించింది అన్నారు.

మహిళల శక్తిగా మహిళా శక్తి పథకం
ఈ పథకము ద్వారా జిల్లాలోని మహిళా సంఘాలను బలోపేతం చేయుటకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. జిల్లాలోని అమరచింత, వనపర్తి మండలాల లో మరియు జిల్లా మహిళా సమాఖ్యలకు “కుసుమ్ ప్రాజెక్టు” ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణం కొరకు రూ.60 లక్షలు మంజూరు కావడం జరిగిందన్నారు. జిల్లాలో మహిళా సంఘాల ద్వారా కొత్తకోట మండలం మిరాస్ పల్లి గ్రామములో 1 ఎకరం స్థలంలో BPCL కంపెనీ ఒప్పందంతో రూ.2కోట్లతో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు.

ప్రతి మహిళా సంఘ సభ్యురాలికి ఒక నాణ్యమైన చీర అందించే ఉద్దేశంతో వనపర్తి జిల్లాలోని 1,27,715 మంది మహిళా సంఘ సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మహిళా జిల్లా సమాఖ్య భవన నిర్మాణం కొరకు 5కోట్ల రూపాయల నిధులు మంజూరై పనులు వేగంగా కొనసాగుచున్నవని తెలిపారు.

పేదలకు ఆరోగ్యదాయనిగా మారిన రాజీవ్ ఆరోగ్యశ్రీ:
“అందరికీ ఆరోగ్యం” సాధించాలనే లక్ష్యంతో, రేషన్ కార్డు కలిగిన ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించడం జరుగుతుంది. గతంలో ఉన్న వైద్య చికిత్సల ఖర్చు పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచి ఈ ప్రభుత్వం చెల్లించటం జరుగుతుంది. వనపర్తి జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 10,536 మంది రూ.32.14 కోట్ల విలువైన వైద్య సేవలను వినియోగించుకున్నారన్నారు.

ఇందిరమ్మ ఇళ్ళు పథకం
నిరుపేదల సొంత ఇంటి కల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని అమలుపరుస్తోంది. అర్హులైన ప్రతి కుటుంబానికి స్వంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తుంది. ఇప్పటివరకు జిల్లాలో 5,970 ఇండ్లను మంజూరు చేయగా, దీంట్లో 86 % గృహాల నిర్మాణం చేపట్టగా, ఇప్పటివరకు 1, 063 గృహాల నిర్మాణ పనులు పూర్తయి ఇదివరకు ఇల్లు లేని నిరుపేదలు యజమానులుగా మారారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దీనికి గాను ఈ పథకం కింద ఇప్పటివరకు మన జిల్లాలో రూ.125 కోట్ల 19 లక్షలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా 2వ విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి కొత్తగా 2వేల ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందన్నారు.

గృహజ్యోతి పథకం:
ఈ పథకం క్రింద రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల లోపు విద్యుత్ ను వినియోగించుకొనుటకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు 84,906 కుటుంబాలు రూ.51.98 కోట్ల  లబ్దిపొందారన్నారు.

రైతు భరోసాతో రైతుల జీవితాలకు భరోసా:
రైతు భరోసా పథకం క్రింద జిల్లాలో యాసంగి 2025-26 సీజన్ కు ఇప్పటివరకు 1,83,839 మంది రైతులకు ఎకరాకు 6 వేల రూపాయలు చొప్పున రూ. 140.41 కోట్ల రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందనారు.

రైతులకు భీమా కల్పించాలనే ఉద్దేశముతో 18 నుండి 59 సంవత్సరాల వయసు కల్గిన రైతులు మరణిస్తే వారి వారసులకు రైతు భీమా పథకం క్రింద రూ.5 లక్షలు అందచేయడం జరుగుతుందన్నారు. వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు 378 మంది రైతులకు, రూ.18 కోట్ల 90 లక్షల వారి నామిని ఖాతాలలో జమచేయడం జరిగిందని తెలిపారు.

సన్నరకం వరికి మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ.500 చొప్పున ధాన్యం సరఫరా చేసిన 57,954 మంది రైతుల ఖాతాలలో రూ.124 కోట్ల 83 లక్షలు జమ చేయడం జరిగిందన్నారు.

పేదలకు కడుపు నిండా అన్నం పెట్టడానికి ప్రతి రేషన్ కార్డ్ దారునికి సన్న బియ్యం అందించే ఉద్దేశంతో వనపర్తి జిల్లాలో 1,82,262 రేషన్ కార్డుల ద్వారా సన్న రకం బియ్యం పంపిణీ చేయడం జరుగుచున్నదన్నారు. జిల్లా లో 25,167 కొత్త రేషన్ కార్డుల తో పాటు 1 లక్ష 57 మంది అదనపు కుటుంబ సభ్యులను కూడా ఇదివరకే ఉన్న కార్డులలో చేర్చడం జరిగింది.

రైతన్నలకు 2 లక్షల వరకు రుణ మాఫీ
దేశంలో ఎన్నడూ జరగని రీతిలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల వరకూ రైతుల రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. జిల్లాలో ఈ పథకం క్రింద ఇప్పటివరకు 61,687 మంది రైతులకు ఉన్న 491 కోట్ల 14 లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేయడం జరిగిందని చెప్పారు.

భూ భారతి చట్టం:
రైతుల భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే దృఢ సంకల్పంతో ఈ ప్రజా ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమల్లోకి త…

Scroll to Top