వనపర్తి జిల్లాలోని 5 మండలాల్లో జరిగిన తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి – జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
సాక్షిత వనపర్తి
వనపర్తి జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ 5 మండలాల్లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.
ఉదయం 7 గంటల నుండి ప్రారంభమయి మధ్యాహ్నం 1.00 గంట వరకు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ తీరును కలెక్టరేట్లోని సమావేశం మందిరం నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ డి సునీత, సాధారణ ఎన్నికల పరిశీలకులు మల్లయ్య భట్టు, వ్యయ పరిశీలకులు శ్రీనివాస్ తో కలిసి పర్యవేక్షించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సకాలంలో ఎన్నికలు పూర్తి కాగా ఘనపూర్ గ్రామ పంచాయతీలో మధ్యాహ్నం 1.00 గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్లందరికీ ఓటింగ్ పూర్తి చేయించారు.
మధ్యాహ్నం 1.00 గంట వరకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లకు పోలింగ్ కేంద్రాల గేట్లు మూసి క్యూ లైన్లలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా పోలింగ్ ముగిసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పోలీస్ శాఖ ద్వారా కట్టుదిట్టమైన శాంతిభద్రతలు అమలు చేసినట్టు తెలిపారు.
తొలివిడతలో పోలింగ్ జరిగిన ఘనపూర్, పెద్దమందడి, గోపాల్పేట, రేవల్లి ఏదుల ఐదు మండలాల్లో మొత్తం కలిపి 1,03,225 ఓట్లు పోల్ కాగా, 84.9 వోటింగ్ పర్సంటేజీ నమోదయింది.
అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
