ప్రజా సమస్యల పరిష్కారమే తొలి లక్ష్యం
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
*కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి వినతిని పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో వెంటనే ఫోన్‌లో మాట్లాడి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా, ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజా సంక్షేమం, ప్రజల సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించడమే కూటమి ప్రభుత్వ తొలి లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి సమస్యను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యాలయం
కోవూరు

