కుత్బుల్లాపూర్ నియోజక వర్గం లోని గాజులరామారం లోని ప్రఖ్యాతగాంచిన శ్రీ చిత్తరమ్మ దేవి జాతరలో భాగంగా దేవాలయంలో గవ్వాంత పూజలు, మూలమంత్ర జపము, చండీ హోమము, పూర్ణహూతి, బలిప్రధానం మరియు ఇతర పూజలలో ఆలయ కమిటీ వారి ఆహ్వానం ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మరియు వారి సోదరులు కంటెస్టెంట్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు…
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ చిత్తరమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు కృప, కటాక్షాలు, చల్లని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు. అనంతరం ఆలయ కమిటీ వారు కూన శ్రీశైలం గౌడ్ ని మరియు వారి సోదరుడు శ్రీనివాస్ గౌడ్ ని శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు స్థానిక డివిజన్ నాయకులు భక్తులు పాల్గొన్నారు.

