ఉద్యాన పంటల సాగుతో అధిక ఆదాయం..
జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య….
చిలుకూరు సాక్షిత : తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయాన్ని అందించే ఉద్యాన పంటలను సాగు చేసి రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి తీగల నాగయ్య అన్నారు. మండల పరిధిలోని చెన్నారి గూడెం, చిలుకూరు గ్రామంలో శాశ్వతం తీగ పందిరి ద్వారా కూరగాయల సాగు చేస్తున్న రైతుల వ్యవసాయ క్షేత్రాలను ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రాయతీలను సద్వినియోగం చేసుకొని రైతులు ఆర్థికంగా ఎదగాలన్నారు ఉద్యాన శాఖ ద్వారా కూరగాయల పందేల నిర్మాణానికి ఎకరానికి లక్ష రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. కూరగాయల సాగు చేసే రైతులు తక్కువ సమయంలో ఎక్కువ పంటలతో పాటు అధిక ఆదాయాన్ని సాధించే అవకాశం ఉందన్నారు. వరి పంటతో పాటు ఉద్యాన పంటల సాగు పైన కూడా రైతులు దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమం లో సూర్యాపేట ప్రాంతీయ ఉద్యాన అదికారిను పి అనిత , విస్తరణాధికారి రంగు ముత్యంరాజు, రైతులు పి శ్రీనివాస్, పిల్లుట్ల బ్రహ్మం పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
