కార్పొరేషన్ ఆశావాహుల నుండి దరఖాస్తులు స్వీకరణ

Sakshitha news

కార్పొరేషన్ ఆశావాహుల నుండి దరఖాస్తులు స్వీకరణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

అధిష్టానం నిర్ణయమే ఫైనల్

సమిష్టిగా కృషి చేసి కాంగ్రెస్ ను గెలిపిద్దాం

టిపిసిసి జనరల్ సెక్రెటరీ నాగా సీతారాములు.

కొత్తగూడెం పట్టణంలో గల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు త్వరలో జరగనున్న కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్ల నుండి పోటీ చేయు పార్టీ ఆశావాహుల నుండి టిపిసిసి జనరల్ సెక్రెటరీ నాగాసీతారాములు దరఖాస్తులను స్వీకరించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో సమిష్టిగా పని చేయాలని, అధిష్టానం సర్వే ద్వారా అభ్యర్థుల ఎంపికను నిర్ణయిస్తుందని, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం కదం తొక్కుదామని, ప్రజా ప్రభుత్వంలో పేదల కోసం తీసుకొచ్చిన అనేక సంక్షేమ , అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు .

Scroll to Top