నేతన్నల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన కూటమి ప్రభుత్వం…
ఉచిత విద్యుత్తుతో నేతన్నలకు మేలు…
ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నాం…
రూ.150 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 1,04,488 చేనేత కుటుంబాలకు చేయూత…
కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు…
నేతన్నల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపే విధంగా, చేనేత మగ్గాల వారికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు సరఫరా చేయడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో నేతన్నలకు ఎంతో మేలు కలుగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఎమ్మెల్యే బండారు కేతరాజుపల్లిలో చేనేత కార్మికుల ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు. ఈ పథకంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.150 కోట్లతో లక్షకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు. మరమగ్గాల వారికి నెలకు రూ.1800 వరకు ఆదా అవుతుందన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో సుమారు 16 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. నేతన్నల నేస్తం కూడా త్వరలో అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారని ఆయన అన్నారు
. వృత్తినే నమ్ముకుని పనిచేస్తున్న పేద చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం ఈనాడు ఉచిత విద్యుత్, ఇతరత్రా సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా వారి పురోభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందన్నారు. ఇటువంటి మంచి పథకాలతో నేతన్నలకు అండగా నిలుస్తున్న ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన అన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY