డబ్బులు,మద్యంఏరులై పారిన పురవీధులు ( సైడ్ అయిన) కళ్ళు మూసుకున్న ఆప్కారి శాఖ
పోలీసుల అండతోఅధికార పార్టీ అభ్యర్థుల వీరంగం
ఎన్నికలు ప్రశాంతం అంటున్న పోలీసు, అధికారులు
సాక్షిత వనపర్తి ; రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా
వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో 33 వార్డులలోముఖ్యమైన పార్టీలు బిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి కమ్యూనిస్టు లు జనసేన ఎంఐఎం స్వతంత్ర అభ్యర్థులు మొత్తం కలిపి స్నుటి తర్వాత మొత్తం120 నుంచి 130 దాకా అభ్యర్థులు బరిలో నిలువగా ఫిబ్రవరి 3 నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం ప్రారంభించడం జరిగింది అప్పటినుండి వార్డుల ఓటర్ల లిస్టులను చేతిలో పట్టుకొని ఓటర్ల కు ఫోన్ల ద్వారా ఇండ్ల దగ్గరికి వెళ్లి తమ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తూ వారం రోజులపాటు ప్రచారం నిర్వహించారు వీరితోపాటు ముఖ్యమైన పార్టీల నేతలు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్లు వీధి ప్రచారాలు ముగింపు తేదీ దగ్గర పడే కొద్ది అన్ని పార్టీల అభ్యర్థులు వార్డులు ఓటర్లకు పగలంతా ఇంటింటి ప్రచారంతో పాటు రాత్రిపూట రహస్యంగా తమ అనుచరుల ద్వారా మద్యం బాటిల్స్ పంపిణీ చేస్తూ తమకే ఓటు వేయాలనీ ప్రచారం చివరి రోజు వరకు వార్డు ల్లో వీధుల్లో ఇంటింటికిఓటర్ల సంఖ్యను బట్టిమధ్యము డబ్బులు బరిలో ఉన్న అన్ని పార్టీల అభ్యర్థులు పంపిణీ చేయడం పురవీధుల్లో డబ్బు మద్యం ఏరులై పారుతున్న ఇదంతా పోలీస్ శాఖ గానీ ఆప్కారి శాఖ అధికారులకు ఎన్నికల అధికారులకు ఎలాంటి సమాచారం లేదంట మొత్తం 33 వార్డులలో కేవలం మూడు మద్యం కేసులు మాత్రమే నమోదయ అని ఆప్కారి ఎస్సై తెలపడం విశేషం ఇకపోతే ప్రచారం చివరి రోజున ఆ తర్వాత రోజు అభ్యర్థుల అభ్యర్థుల అనుచరుల మధ్య మద్యం డబ్బులు పంపిణీ సమయంలో వివాదాలు గొడవలు చోటు చేసుకున్నప్పటికీ 30 యాక్టు ఉన్న అటువైపు వెళ్ళకపోవడం అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తూ ఇదంతా అధికార పార్టీ సపోర్టు తోనే జరుగుతుందని ఇతర పార్టీల అభ్యర్థులు అనుమానంవ్యక్తం చేస్తా ఉన్నారు అయితే పోలింగ్ ముందు రోజు ఒకటో వార్డులో మరికొన్ని వార్డులలో పోలింగ్ రోజున 33 వార్డులలో అభ్యర్థుల మధ్య వివాదాలు చెదుర మాధురి గొడవలు చోటు చేసుకున్నప్పటికీ పోలీసులు ఎలాంటి చదరమదురుగాని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని తెలుపుతూ ఉండడం విశేషం 33 వార్డులో అభ్యర్థుల మధ్య గొడవలు చోటు చేసుకున్నప్పటికీ సంఘటన దగ్గరికి మీడియా చేరుకునే లోపే కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు వారి మధ్య సయోధ్య కుదురుస్తూ మీడియాకు ఎలాంటి సమాచారం అందకుండా మీడియేషన్ చేస్తూ పోలీసులు అప్పటివరకు ఉన్న ఫోటోలు వీడియోల ఆధారాలను డిలీట్ చేయించడం జరిగింది ఇదంతా పోలీసులు ఆప్కారి, ఎన్నికల అధికారుల సపోర్టుతోనే ప్రభుత్వాన్ని కి అనుకూలంగా పుర ఎన్నికలు ముగిశాయని ప్రతిపక్ష స్వతంత్ర అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుఇతర పార్టీ లా నాయకులు ఆరోపిస్తున్నారు ఏది ఏమైనా 13 తారీకున ఎన్నికల ఫలితాల వరకు ఉత్కంఠతో అందరూ వేచి చూడాల్సిందే మరి.

