రహదారిపై ఢీకొన్న లారీలు : రాక పోకలకు తీవ్ర అంతరాయం
సాక్షిత: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలం నారం వారి గూడెం సమీపంలోని హైవే పై రాత్రి రెండు లారీలు ఢీకొన్నాయి. ఇనపరాట్లతో వెళుతున్న లారీ రోడ్డుకి అడ్డంగా పడిపోయి లారీలో రాడ్లన్నీ చల్లాచెదురుగా అయిపోయాయి. దీంతో రహదారిపై భారీగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖమ్మం వైపు నుండి రాజమండ్రి వెళ్తున్న ఇనుప రాడ్ల లారీ, అశ్వారావుపేట వైపు నుండి ఖమ్మం వైపు వెళుతున్న మరో లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. రెండు లారీల డ్రైవర్లు క్యాబిన్లో ఇరుక్కుపోయారు. స్థానికుల సమాచారం అందుకొని పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో లారీలను ప్రక్కకు తొలగించి రాకపోకలకు అంతరాయం కలగకుండా చేశారు. ఈ యాక్సిడెంట్ చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.ఇది చాలా ఘోరమైన యాక్సిడెంట్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది వెంటనే స్పందించి రహదారిని వెంటనే పునరుద్ధరించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
