తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను

Sakshitha news

తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు.మహిళా గ్రూపులను ఏకం చేసి వాటిని బలోపేతం చేసి ప్రత్యేక పథకాలను కేటాయించడం ద్వారా మహిళల్లో ఆర్థిక సాధికారత తీసుకురావాలని సీఎం దృడసంకల్పం అన్నారు. మేడ్చల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మీరాజనోళ్ళ ఆధ్వర్యంలో మంగళవారం కూకట్పల్లి నియోజకవర్గo కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శ్రీహేమదుర్గ భవన్లో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు త్వరలో ఏర్పాటు చేయబోయే బూత్ కమిటీల ఏర్పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపైన ఈ సమావేశంలో చర్చించారు.

ఈ పథకాలన్నీ ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అనేది మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు గమనించాలని వాటిని పేద ప్రజలకు అందేలా కృషి చేయాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి మహిళా కార్యకర్తలు గట్టిగా కృషి చేయాలని అయన సూచించారు. పార్టీ కోసం పని చేస్తూ పోతే పదవులు వాటoతట అవే వస్తాయని తద్వారా పార్టీలో తగిన గుర్తింపు గౌరవం లభిస్తుందన్నారు.సోషల్ మీడియాలోనూ మహిళా కార్యకర్తలు యాక్టివ్ గా ఉండాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు లక్ష్మీదేవి రాష్ట్ర మహిళా ప్రధానకార్యదర్శి రజిత రాష్ట్ర కార్యదర్శి రీనా బ్లాక్ మహిళా అధ్యక్షురాలు మరియు డివిజన్ మహిళా అధ్యక్షురాలు ఇతర మహిళా నాయకురాళ్ళు తదితరులు పాల్గొన్నారు.