మరణించిన తేదీ అంటూ లేని మహానుభావుడు సుభాష్ చంద్రబోస్.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.
భారతదేశ స్వతంత్ర పోరాట వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్టలోని కార్యాలయం ఎదురుగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది.
ఈ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశము నుండి బ్రిటిషర్లను పారద్రోలలంటే ప్రజలకు సైనిక శిక్షణ అవసరమని వారికోసం ఆజాద్ హింద్ ఫౌండేషన్ ని స్థాపించి వేలాది మందికి శిక్షణ నిచ్చి ప్రజలను చైతన్యపరిచిన మొట్టమొదటి నాయకుడు సుభాష్ చంద్రబోస్ ని, జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షుడైనప్పటికీ గాంధీజీ విధానాలతో వ్యతిరేకిస్తూ, ఈ దేశంలో సోషలిస్టు వ్యవస్థను ఏర్పరచాలని దానికి ఇతర దేశాల మద్దతు కూడా తీసుకోవాలని చెప్పి దేశ స్వాతంత్రోద్యమంలో వివిధ దేశాల నుండి మద్దతు సంపాదించారని అన్నారు. ముఖ్యంగా యువకులు కేవలం చదువుకోవడమే కాకుండా దాన్ని సమాజానికి ఉపయోగించాలని తద్వారా సమాజంలో శాంతి నెల కోల్పోవచ్చని ఆనాడే యువకులకు దిశా నిర్దేశం చేశారని, మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని తెచ్చి పెడతా అని నినాదం ఇచ్చి ప్రజలను చైతన్యపరిచినటువంటి గొప్ప వ్యక్తి అందరితో నేతాజీగా పిలవబడిన మహానాయకుడు సుభాష్ చంద్రబోస్ ని అన్నారు.
వారి స్ఫూర్తితో తర్వాతి తరాలు తమ వారసులకు సుభాష్ చంద్రబోస్ అని పేరు పెట్టడం ఒక సుభాష్ చంద్రబోస్ కి దక్కుతుందని, నేడు అదే స్ఫూర్తితో యువకులు పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమానికి మండల కార్యదర్శి కే స్వామి అధ్యక్షత వహించగా సహాయ కార్యదర్శిలు రాములు , హరినాథ్ రావు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వి శ్రీనివాస్ సిపిఐ నాయకులు దుర్గయ్య, కె వెంకటేష్, రవి, సామెల్, యాదగిరి, శ్రీనివాస్ చారి,నారాయణ మేస్త్రి, యువజన నాయకులు కీర్తి, వంశీ,సుంకిరెడ్డి, నరేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
