నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలు

Sakshitha news

నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలు

సాక్షిత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట నియోజకవర్గం
ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ, రక్తదాన శిభిరం, రోగులకు పాలు, పండ్లు పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు.
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ముందుగా కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను జరిపారు. అనంతరం
అదేవిధంగా చండ్రుగొండ మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించిన అనంతరం సీతాయిగూడెం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేసి, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అన్నపురెడ్డిపల్లి మండలకేంద్రంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రధాన సెంటర్లో నాయకుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ములకలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో వేడుకలు నిర్వహించగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు పంపిణీ చేశారు. ఆ తదుపరి అశ్వారావుపేట ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఘనంగా నిర్వహించిన తరువాత ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.