ఇఫ్తార్ విందులో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజక వర్గ మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ …
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాంధీనగర్ లోని (రాయల్ ప్యాలెస్ లో ) శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ వేడుకల్లో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై విందులో పాల్గొన్నారు….
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారు భేధాలు మరచి, ప్రేమను పంచి
సోదరభావాన్ని పెంపొందించి
మత సామరస్యం, ఐక్యత, ఆనందాన్ని
ఆధ్యాత్మికను అందించే పవిత్ర మాసంలో
జరిగే ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరలతో కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు..
అదేవిధంగా జగద్గిరిగుట్ట లోని ( శ్రీనివాస్ నగర్ లో) సయ్యద్ రషీద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో సైతం మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు…
అదేవిధంగా మైనార్టీ సోదరులందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు…
అనంతరం మైనారిటీ సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్ధన చేసి ఉపవాస దీక్ష విరమణ లో పాల్గొన్నారు…
ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు , నక్క ప్రభాకర్ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ముస్లిం మైనార్టీ సోదరులు పాల్గొన్నారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY